గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు వీడ్కోలు పలకనున్నట్లు తెలిసింది. ఇవాళ గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగే సభలో పార్టీ శ్రేణులకు పెద్ద ఎత్తున విందు ఇచ్చిన అనంతరం వీడ్కోలు నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం.
ఇకపై ఆయన పూర్తిగా వ్యాపారంపై దృష్టి సారించనున్నారని తెలుస్తోంది. కాగా, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎంపీగా జయదేవ్ గెలిచారు.