కైకలూరు మండలం సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) కైకలూరు సిబ్బంది వివిధ సమస్యలు పరిష్కారం కోసం ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కి వినతి పత్రం అందించారు. ఆదివారం ఆటపాక లోని ఎమ్మెల్సీ కార్యాలయం లో కలిసిన సెర్పు సిబ్బందికి వినతికి సానుకూలంగా స్పందించి ఈ సమస్యను సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టి కి తీసుకు వెళ్తానని జయమంగళ తెలియచేశారు. ఎ పిఎం సత్యనారయణ, సిబ్బంది పాల్గొన్నారు.