అనకాపల్లి కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రతి మండల నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించాలని రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రంశెట్టి పాపారావు అనకాపల్లి జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.
నర్సీపట్నంలో ఆయన శనివారం మాట్లాడుతూ అనకాపల్లి పట్టణానికి దూరంగా ఈ కార్యాలయాలను ఏర్పాటు చేయడంతో సామాన్య ప్రజలు అక్కడికి వెళ్లడానికి పలు అవస్థలు పడుతున్నట్లు తెలిపారు.