తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా రోడ్-బ్రహ్మపుర మధ్య లిమిటెడ్ హైట్ సబ్ వే నిర్మాణపనుల కారణంగా పలు రైళ్ల రాకపోకల్లో తాత్కాలిక మార్పులు చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎకె త్రిపాఠి ఆదివారం తెలిపారు.
ఫిబ్రవరి 1న భువనేశ్వర్-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, పూరీ-గుణుపూర్ రైళ్లు 3గంటలు ఈ నెల 31న తిరుపతి-పూరీ, తిరునెల్వేలి- పురి లియా, ఫిబ్రవరి 1న గుణుపూర్-పూరీ రైళ్లు 4 గంటలు ఆలస్యంగా బయలు దేరుతాయని పేర్కొన్నారు.