ద్విచక్రవాహనం చోరీ ఘటనపై అజిత్ సింగ్ నగర్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం దేవినగర్ ప్రాంతానికి చెందిన షేక్ షఫీక్ బాష ఈ నెల 14న రాత్రి తన ద్విచక్రవాహనంపై ఇంటికి వచ్చి తాళం వేసి లోపలికి వెళ్లాడు.
మరుసటి రోజు ఉదయం చూడగా ద్విచక్రవాహనం కనిపించలేదు. ద్విచక్రవాహనం చోరీకి గురైనట్టు భావించి అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.