భర్త కనిపించడం లేదని ఓ మహిళ భవానీపురం పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. విజయలక్ష్మీ, శ్రీనివాస రావు దంపతులు భవానీపురం క్రాంబ్వే రోడ్డులో నివాసం ఉంటున్నారు.
శ్రీనివాసరావు జేసీబీ డ్రైవర్ గా పని చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ఇంటికి వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. ఈ మేరకు భార్య ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు