అమెరికాలోని కాలిఫోర్నియాను బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. ఏవియెన్ ఇన్‌ఫ్లూయెంజా అని పిలిచే ఈ వ్యాధి అక్కడి పక్షుల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కాలిఫోర్నియా కోళ్ల పరిశ్రమ ఏకంగా లాక్‌డౌన్ ప్రకటించే పరిస్థితి ఏర్పడింది. అడవి పక్షులకు ఈ వ్యాధి సోకుతుండటంతో అవి ఆకాశంలో ఎగురుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. ఈ వ్యాధి మనుషులకు, వారి పెంపుడు జంతువులకు కూడా వస్తుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.