వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం పానిపట్ నుండి తొమ్మిది నగరాలకు ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును ప్రారంభించారు. మన రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు బాగానే ఉన్నాయి.. పారిశ్రామికవేత్తలు రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు. రాష్ట్రంలోకి వస్తున్న పెట్టుబడులు యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోంది. తలసరి జీఎస్టీ వసూళ్లు దేశంలోనే అత్యుత్తమంగా ఉన్నాయని తెలిపారు. ఈ-బస్సు ప్రజల రవాణా కష్టాలను తీరుస్తుందని ఆయన తెలిపారు.