రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మాటల తూటాలతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఏపీలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాక భారంగా మారిపోందనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు షర్మిల కౌంటర్ ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో ఇంటిగుట్టు రచ్చకెక్కడాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం...
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలో భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన అనంతరం సునీత ఆమెను కలవడం ఇదే తొలిసారి. తన తండ్రి హత్యపై న్యాయ పోరాటంలోనూ సునీతకు షర్మిల అండగా నిలిచారు. దీంతో షర్మిల భేటీ తర్వాత కాంగ్రెస్లో చేరడంపై సునీత కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.