ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో పొగమంచు విపరీతంగా పెరిగింది. ఉదయం పూట బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. వాహనదారులు రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. పట్టపగలు హెడ్ లైట్లు వేసుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం తొమ్మిది గంటలైనా పొగమంచు కమ్ముకోలేదు. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ పనులకు ఆటంకం ఏర్పడుతుందని వాహనదారులు చెబుతున్నారు.