పల్నాడు జిల్లా తొండపిలో దాడి వెనుక మంత్రి అంబటి రాంబాబు ఉన్నారంటూ కన్నా లక్ష్మీనారాయణ చేసిన ఆరోపణలపై సోమవారం మంత్రి అంబటి ఖండించారు. తాను ఎవరిపైనా దాడులు చేయించే రకం కాదని, అందరూ సామరస్యంగా ఉండాలనుకునే వ్యక్తినని అంబటి తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించడానికి ముందు పోలీసుల అనుమతి తీసుకొని ఉంటే బాగుండేదన్నారు. గతంలో తమ మీద కూడా దాడులు జరిగాయని తెలిపారు.