అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మన్యంలో చలి తీవ్రత పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో పొగమంచు చలి ప్రభావం అధికమవుతుంది. దీంతో అరకులోయ మన్యం ప్రజలు చలికి వణుకుతున్నారు. సోమవారం ఉదయం అరకులోయలో 12. 8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో చలికి తట్టుకోలేక ప్రజలు ఉన్ని దుస్తులు ధరించి ఉదయం సాయంత్రం చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa