తిరుపతి జిల్లా, గూడూరు నియోజకవర్గంలోని కోట మండల కేంద్రంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర జనంతో హోరెత్తింది. అశేషజనం తరలిరావడంతో పట్టణంలోని పురవీధులు జనసంద్రంగా మారాయి. మహిళలు, యువత భారీ సంఖ్యలో పాల్గొని ‘జై జగన్’ నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రులు, వైయస్ఆర్‌సీపీ నేతలు మాట్లాడుతూ.. వైయస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను.. వాటి ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిగిన లబ్ధిని వివరించారు. చంద్రబాబు ఏనాడూ బీసీలను పట్టించుకోలేదని మండిపడ్డారు. కుటుంబాలను చీల్చడమే ఆ పార్టీల పని అని విమర్శించారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోట మండల కేంద్రంలో జరిగిన సామాజిక సాధికారత బస్సు యాత్ర జనంతో హోరెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేకూరిన సామాజిక సాధికారతను వివరించే క్రమంలో ఆదివారం నిర్వహించిన ఈ యాత్రకు అశేషజనం తరలిరావడంతో పట్టణంలోని పురవీధులు జనసంద్రంగా మారాయి. వైయస్ఆర్‌సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో గూడూరు వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త మేరిగ మురళీధర్‌తో పాటు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పట్టణంలోని గోపాల్‌రెడ్డి విగ్రహం నుంచి సభాస్థలి వరకు ఆదివారం బస్సుయాత్ర సాగింది. 500 మీటర్ల ఈ యాత్ర చేయడానికి గంటకు పైగా సమయం పట్టింది. సభా వేదికపై ముందుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావ్ ఫూలే, అల్లూరి సీతారామరాజు, వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సభను ఆరంభించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి మాట్లాడుతూ.. సోనియా, చంద్రబాబులు అన్యాయంగా జగన్‌ను జైలుకు పంపారన్నారు. అయితే, ప్రజల ఆశీస్సులతో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఐదేళ్లపాటు అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను గుర్తించి వారికి అండగా నిలిచారన్నారు. పేద ప్రజల గుండెల్లో సీఎం జగన్ కొలువుదీరారన్నారు. గతంలో కోవర్టులుగా పనిచేసిన వారు మోసంచేసి పార్టీలు మారారని మండిపడ్డారు.