వైయస్ఆర్ ఆసరా కార్యక్రమంతో డ్వాక్రా సంఘాల సభ్యులకు ఆర్థిక భరోసా లభించిందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకూర్మం(గార మండలం) లో జరిగిన వైయస్ఆర్ ఆసరా నాలుగో విడత పంపిణీ కార్యక్రమానికి రెవెన్యూ శాఖా మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2014 ఎన్నికల ముందు హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మహిళా సంఘాలను, రైతులను మోసం చేశారు. 2018-19 లో ఇప్పటి సీఎం,అప్పటి విపక్ష నేత జగన్ పాదయాత్రలో చెప్పినట్లుగా నాలుగు దఫాలలో చెల్లిస్తాం అని చెప్పారు. పూర్తి చేశారు. ఫిబ్రవరిలో వైయస్ఆర్ చేయూత పథకం అందించేందుకు మళ్ళీ వస్తాం. 5 ఏళ్ల ఈ ప్రభుత్వ కాలంలో ఎన్నికల ముందు చెప్పినవన్నీ చేశాం. సంక్షేమం ఒక ఎత్తు అయితే, గ్రామంలో ఉన్న ప్రభుత్వ బడులు,సచివాలయం భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్ నెస్ సెంటర్, రోడ్ల నిర్మాణం అన్నవి మరో ఎత్తు. ఇవి అన్నీ అభివృద్ధి కాదా .. ? పేద పిల్లలు గౌరవంగా ఈ రోజు ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారు. ఇందుకు కారణం ఎవరో.. గుర్తించి రానున్న ఎన్నికల్లో వారి కోసం పని చేయాలి. చంద్రబాబుకు ఆ రోజు అధికారం ఉన్న నాడు ఖజానా అంతా దోచుకున్నారు. సీఎం జగన్ మాత్రం పేదల స్థితి,గతులు పెంచేందుకు కృషి చేస్తున్నారు. కళ్ళ ముందు కనిపిస్తున్న వాటిని నమ్మకుండా, ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్స్ చూస్తే ఏం వస్తుంది.? వాళ్లు అందరూ స్వార్థ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారు అని అన్నారు.