రాష్ట్రంలో ప్రతిపక్షాలు నక్కజిత్తుల రాజకీయాలు చేస్తున్నాయని మంత్రులు పీడిక రాజన్నదొర, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు ఘాటుగా విమర్శించారు. త్వరలో జరగబోయే ఎన్నికల మహా యుద్ధానికి అంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అమలు కాని హామీలిచ్చే మోసగాళ్లొస్తున్నారు జాగ్రత్త అని హెచ్చరించారు. విశాఖపట్నం జిల్లా సంగివలస వద్ద జరిగిన ‘సిద్ధం’ సభలో వారు ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నప్పటికీ, ప్రతిపక్షాలు దు్రష్పచారం చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వ పాలనకు తేడాను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు చెప్పారు.