ప్రజలు మార్పును ఆశిస్తున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలిగే నాయకత్వాన్ని కోరుకుంటున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రజాసంక్షేమం పేరుతో అధికార పార్టీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. విజయవాడలో మాట్లాడుతూ.. గత పదేళ్ల పాలనలో కేంద్రం అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. రాష్ట్రంలోనూ బీజేపీ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. పొత్తులపై పార్టీ అధిష్ఠానం త్వరలోనే స్పష్టత ఇస్తుందని పేర్కొన్నారు.