పల్నాడు ప్రాంతంలో జగన్ రాజ్యం నడుస్తోందని టీడీపీ నేత లోకేశ్ మండిపడ్డారు. మాచర్లలో కొందరు పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తూ బలహీనవర్గాలపై మారణహోమం సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. వెల్దుర్తిలో టీడీపీ సానుభూతిపరులైన మత్స్యకారులను వైసీపీలో చేరాలని ఎస్ఐ శ్రీహరి ఒత్తిడి చేశారన్నారు. దీంతో ఆయన బలవన్మరణం చెందారు. ఎస్సైపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.