మహిళలు జగన్ ప్రభుత్వానికి అండగా ఉన్నారని యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు అన్నారు. వైఎస్సార్ ఆసరా 4వవిడత సంబరాల్లో భాగంగా మంగళవారం మునగపాక రాజీవ్ కళ్యాణ్ మండపంలో డ్వాక్రా మహిళలకు చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్రా మహిళలకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీతో సున్నా వడ్డీ అమలు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. రానున్న రోజులలో మరిన్ని మెరుగైన పథకాలు అందుకోవాలంటే జగన్ ను గెలిపించాలని కోరారు.