విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడంపై రాజస్థాన్‌లోనూ వివాదం మొదలైంది. భజన్‌లాల్ సర్కారూ హిజాబ్ నిషేధానికి సంబంధించి సన్నాహాలు మొదలుపెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రి కిరోరిలాల్ మీనా హిజాబ్, బురఖాపై నిషేధం విధించాలని వ్యాఖ్యానించారు. ముస్లిం దేశాలలోనే నిషేధించినప్పుడు ఇక్కడ ఎందుకు కొనసాగించాలని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో విద్యా శాఖామంత్రి ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులు, రాజస్థాన్‌లో దాని ప్రభావంపై నివేదిక కోరినట్లు తెలుస్తోంది.