ఉత్తరప్రదేశ్ తాత్కాలిక డీజీపీగా ప్రశాంత్ కుమార్ను నియమించారు. లా అండ్ ఆర్డర్ డీజీగా ఉన్న ఆయనకు.. డీజీపీ బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుత డీజీపీ విజయ్ కుమార్ రిటైర్ అవుతున్నారు. ఆయన స్థానంలో ప్రశాంత్ కుమార్ నియమితులయ్యారు. కాగా, యూపీకి ఇప్పటివరకు పూర్తి స్థాయి డీజీపీని నియమించలేదు. ఆ రాష్ట్రానికి వరుసగా నాలుగవ సారి యూపీ డీజీపీ పోస్టును తాత్కాలిక హోదాలో నియమించారు.