పశ్చిమ బెంగాల్లో విపక్ష ఇండియా కూటమికి ఇబ్బందులు తప్పేలా లేవు. తమ పార్టీతో పొత్తు పెట్టుకోవాలంటే సీపీఎంతో కాంగ్రెస్ తెగదెంపులు చేసుకోవాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హస్తం పార్టీకి షరతు విధించారు.
సీట్ల సర్దుబాటు చర్చలో తాను కాంగ్రెస్కు రెండు సీట్లు ఇవ్వనున్నట్లు తెలిపానన్నారు. ఒక వేళ సీపీఎంతో పొత్తు పెట్టుకుంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్కు ఇవ్వనని ఆమె స్పష్టం చేశారు.