ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తోషాఖానా కేసు.. ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్యకు 14 ఏళ్లు జైలు

international |  Suryaa Desk  | Published : Wed, Jan 31, 2024, 09:48 PM

పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే అధికారిక రహస్యాల లీక్ కేసులో ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. తాజాగా, తోషాఖానా కేసులో ఇమ్రాన్ సహా ఆయన భార్య బుశ్రా బీబీకి న్యాయస్థానం 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే, జరిమానాగా ఒక్కొక్కరు 787 మిలియన్ డాలర్లు (రూ.23 కోట్లు) చెల్లించాలని ఆదేశించింది. అంతేకాదు, పదేళ్ల పాటు ఎలాంటి రాజకీయాలు చేయకుండా నిషేధించింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ నిర్బంధంలో ఉన్న రావల్పిండి అదైలా జైల్లోనే న్యాయమూర్తి మొహమూద్ బషీర్ విచారణ జరిపి తీర్పును వెలువరించారు.


అధికారిక రహస్యాల బహిర్గతం కేసులో ఇమ్రాన్‌తో పాటు మాజీ మంత్రి మహమూద్ ఖురేషిలకు జైలు శిక్ష విదించింది. గతేడాది మార్చిలో వాషింగ్టన్‌లోని రాయబార కార్యాలయం పంపిన రహస్య దౌత్య కేబుల్ (సైఫర్)ను బహిర్గతం చేశారనే ఇమ్రాన్ ఖాన్‌పై ప్రధాన ఆరోపణలు. అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినట్టు కేసు నమోదయ్యింది. ఇక, తోషాఖానా కేసులో ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించగా.. గతేడాది ఆగస్ట్ 5 న అరెస్టయ్యారు. కానీ, ఇస్లామాబాద్ హైకోర్టు ఆ శిక్షను రద్దు చేసినా.. ఇతర కేసుల్లో ఆయన్ను పోలీసులు నిర్బంధించారు.


కాగా, విదేశాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన కానుకలను ప్రభుత్వ ఖాజానాకు అందజేయకుండా వాటిని తక్కువ ధరకే దక్కించుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రధానిగా విదేశీ పర్యటనల్లో వచ్చిన కానుకలను తోషాఖానాలో జమ చేయాలి. లేదా వాటిని తీసుకోవాలంటే నిబంధనల ప్రకారం సగం ధరం చెల్లించాలి. అయితే ఆ బహుమతులను సగం ధరకు కాకుండా.. చాలా తక్కువ ధరకు ఇమ్రాన్ తీసుకున్నట్లు నిరూపణ అయ్యింది. రూ.38 లక్షల విలువైన రొలెక్స్‌ వాచ్ కేవలం రూ.7,54,000 లకు, రూ.15 లక్షల విలువ చేసే మరో రొలెక్స్‌ వాచ్‌ను రూ.2,94,000లు చెల్లించినట్టు తేలింది. వీటితో పాటు మరో రూ.8 లక్షల విలువైన బహుమతులను ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి చెల్లించకుండా తీసుకొన్నారనే ఆరోపణలు వచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com