ప.గో. జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భీమవరం మండలంలో ఓ గ్రామానికి చెందిన మహిళపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం..
బాధిత మహిళ బుధవారం ఉదయం బహిర్భూమికి వెళ్లగా బాలుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ రైటర్ మహేశ్వరరావు వెల్లడించారు. నిందితుడు పాత బాల నేరస్థుడని పేర్కొన్నారు.