ప్రతి నెలా ఒకటో తేదీ భానుడి తొలి కిరణం ప్రసరించకముందే వైయస్ఆర్ పింఛన్ కానుక చేతికి అందుతోంది. అభాగ్యుల మోముల్లో ఆనందం వికసిస్తోంది. ఏ ఆసరాలేని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులు, డప్పుకళాకారులకు నేనున్నానంటూ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఠంచనుగా పింఛన్ అందిస్తూ వారి జీవితాల్లో సంక్షేమ కాంతులు నింపుతున్నారు.