పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్రం ఉమర్‌కోట్‌లో ఓ శివాలయం ఉంది. ఈ శివమందిరం నిత్యం శంభోశంకర స్మరణతో మార్మోగుతుంటుంది. సింధ్‌లోని ఉమర్‌కోట్‌గా పిలిచే ఈ ప్రాంతాన్ని మొదట్లో అమర్‌కోట్ అనేవారు.
కాగా ఈ ఆలయంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. శివలింగం ఇప్పటికీ పెరుగుతుండటం విశేషం. మొదట్లో శివలింగం ఎలా ఉండేదో ఒక వలయాన్ని గీశారు. ఇప్పుడు ఆ వలయాన్ని దాటి ఉండటాన్ని గమనించవచ్చు.