ప్రపంచంలోని అతి పెద్ద దేవాలయంగా కంబోడియాలోని ఆంగ్ కోర్ వాట్ దేవాలయం ప్రసిద్ధిగాంచింది. ఈ దేవాలయం 402 ఎకరాల్లో విస్తరించి ఉంది. పూర్వ కాలంలో ఈ ఆలయాన్ని ‘యశోధర పూర్’ అని పిలిచేవారు.
దీనిని చక్రవర్తి సూర్యవర్మన్ (క్రీ.శ.1112-53) కాలంలో నిర్మించారు. ఈ దేవాలయంలో 12వ శతాబ్దం వరకు విష్ణువుని పూజించేవారు. తరువాత బుద్ధుని పూజిస్తున్నారు. ఈ ఆలయ ప్రధాన గోపురం ఎత్తు దాదాపు 64 మీటర్లు.