ఇండియాలోనే కలిసినట్టుగా ఉండే నేపాల్ దేశం ఇప్పటివరకు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోలేదు. ఎందుకంటే ఈ దేశంలో ఎప్పుడూ విదేశీ ఆక్రమణలు జరగలేదు. బ్రిటిషర్ల కన్ను ఆ దేశం పై పడలేదు.
దీంతో ఆ దేశ ప్రజలు ఎవరిపై యుద్ధాలు చేసి వారి దేశాన్ని దక్కించుకోవాల్సిన అవసరం రాలేదు. నేపాల్ 2008 వరకు రాజుల పరిపాలనలోనే ఉంది. ఆ తర్వాత “ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్” గా అవతరించింది. నేపాల్ కు భారత్ ఆర్థిక సహకారాలు అందిస్తోంది.