రేషన్ కార్డులున్న వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంత్యోదయ అన్న యోజన కింద రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ పథకాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
2026 మార్చి 31 వరకు ఇది కొనసాగుతుందని ప్రకటించింది. ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ప్రతి నెలా కేజీ చక్కెరను సబ్సిడీ కింద ప్రభుత్వం అందిస్తోంది.