హిందూపురం పట్టణంలోని పరిగి బస్టాండ్ వద్ద నూతన సులభ్ కాంప్లెక్స్ నిర్మాణానికి వైఎస్సార్సీపీ నాయకుడు గుడ్డంపల్లి వేణురెడ్డి. కౌన్సిలర్ చిన్నమ్మ ఆధ్వర్యంలో గురువారం భూమి పూజ చేశారు. ప్రజలకు అన్ని సౌక ర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నాగరాజు, చాంద్ బాషా, తౌసిఫ్, ముజీబ్, రామాంజప్ప, వేణు, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.