దివాలా అంచున వేలాడుతున్న పాకిస్థాన్ ఇప్పుడు మాల్దీవులకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుతో పాక్ ప్రధాని అన్వర్ ఉల్‌హక్ కాకర్ మాట్లాడుతూ..
పర్యావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి సహకరిస్తామని చెప్పారు. 1966లో తొలిసారి రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలయ్యాయి. మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు ముయిజ్జు చైనాకు అత్యంత సన్నిహితుడన్న విషయం తెలిసిందే.