విశాఖపట్నం వేదికగా ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి ఆడుదాం - ఆంధ్ర క్రీడా పోటీల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు గావించాలనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
అధికారులు సమన్వయంతో పనిచేసి రాష్ట్ర స్థాయి క్రీడలను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం అధికారులతో ఆయన భేటీ అయ్యారు. క్రీడా ఏర్పాట్లపై సమీక్షించారు.