సీఎం జగన్తో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమావేశమయ్యారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, సార్వత్రిక ఎన్నికల్లో విజయం వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
కాగా, నెల్లూరు సిటీ అసెంబ్లీ ఇన్ఛార్జి నుంచి అనిల్ కుమార్ను సీఎం జగన్ తొలిగించిన సంగతి తెలిసిందే. అనంతరం నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ను ప్రకటించారు.