ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు: వైఎస్ విజయమ్మ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 24, 2018, 11:14 AM

క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉదయం ఇడుపులపాయకు వచ్చిన ఆమె, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, ప్రజలకు, వైఎస్‌ జగన్‌ ను ప్రేమించే అభిమానులకు పండగ శుభాకాంక్షలు చెప్పారు. ఈ పండగ శాంతికి చిహ్నమని, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా కలిలిమెలసి ఉండాలని సూచిస్తుందని అన్నారు. విజయమ్మతో పాటు జగన్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa