కాశ్మీర్ సమస్యకు నిర్మాణాత్మక ఒడంబడిక అవసరమని రాజకీయవేత్తగా మారిన వేర్పాటువాద నాయకుడు సజ్జాద్ లోనే అన్నారు. ప్రస్తుత పరిస్థితిని నియంత్రించడానికి జమ్ము కాశ్మీర్ శాసనసభ పాత్ర ఎంతో ఉందని, అయితే తమ శాసనసభ ద్వారా తగిన పరిష్కారం లభించడం లేదని ఆయన అన్నారు. రాజకీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రముఖ పాత్ర పోషించాలని ఆయన చెప్పారు. లోనే స్థాపించిన పీపుల్స్ కాన్ఫరెన్స్‌లోకి మాజీ ఎమ్మెల్యే జాన్‌క్సర్ సయ్యద్ మొహమ్మద్ బాఖిర్ రిజ్వి సహా పలువురు నేతలు చేరారు.