గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి బాలసాని కిరణ్ కుమార్ శనివారం ఉదయం 11 గంటలకు పెదనందిపాడు మండలం రావిపాడు గ్రామంలో పునీత చిన్న తేజరమ్మ చర్చి వేడుకల్లో పాల్గొంటారు. 12 గంటలకు గ్రామంలో ఎస్సీ స్మశాన వాటిక ప్రహరీ గోడకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం గ్రామ వైసిపి నేతలతో సమావేశం నిర్వహిస్తారని ప్రతిపాడు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.