రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌కు కరోనా సోకింది.ఆయనకు స్వైన్ ఫ్లూ కూడా వచ్చినట్లు మెడికల్ రిపోర్టులో తేలింది. తన ఆరోగ్యం గురించి తెలియజేస్తూ ‘
జ్వరం వస్తున్న కారణంగా, వైద్యుల సలహా మేరకు మెడికల్ టెస్టులు చేయించగా.. కోవిడ్, స్వైన్ ఫ్లూ వచ్చినట్లు నిర్ధారణ అయ్యిందని ‘ఎక్స్’లో తెలియజేశారు. అందరూ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు.