ఇటీవల జోర్డాన్‌లో అమెరికా సైనిక క్యాంప్‌పై జరిగిన డ్రోన్ దాడికి అగ్రరాజ్యం ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇరాక్, సిరియాలోని ఇరాన్ మద్దతు గల మిలిటెంట్లు,
ఇరాన్ రివల్యూషనరీ గార్డుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. ఈ దాడులపై తాజాగా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. తాము ఘర్షణలను కోరుకోవడం లేదని, కానీ అమెరికన్లకు హాని కలిగిస్తే మాత్రం ప్రతిచర్య ఇలాగే ఉంటుందని స్పష్టం చేశారు.