మాట తప్పని నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి తెలిపారు. శనివారం కెవి పల్లి మండలంలో జరిగిన వైకాపా శ్రేణుల సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 100 శాతం పూర్తి చేశారని, మరోసారి ఆయనను ముఖ్యమంత్రిని చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుదామని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీనాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.