వీరపునాయునపల్లె మండలం పాలగిరి గ్రామ ప్రజలు టిడిపి రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశిభట్ల సాయినాథ్ శర్మను శనివారం ఆయన స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిశారు.సాయినాథ్ శర్మను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన చేస్తున్న సేవా గుణం ప్రజాసేవ ఆయన విధానాలు నచ్చి స్వచ్ఛందంగా ఆయన వెంటనడవడానికి వచ్చామన్నారు.ఆయన ఏ పార్టీ అంటే తాము ఆ పార్టీకి మద్దతు ఇస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మోహన్, నారాయణ,ఇస్మాయిల్,చంద్ర నాయుడు పాల్గొన్నారు.