దెందులూరులో జరగనున్న సిద్ధం కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా. తోడేళ్లతో యుద్ధానికి సిద్ధమని వెల్లంపల్లి శ్రీనివాస్ నినాదాలు చేశారు. సెంట్రల్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు తరలి వెళ్తున్నామన్నారు. ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి పాల్గొన్నారు.