ఎల్కే అద్వాణీకి ప్రభుత్వం భారతరత్న ప్రకటించినందుకు తమ కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉందని ఆయన కుమార్తె ప్రతిభా అద్వాణీ తెలిపారు. ‘‘దాదాకు దేశ అత్యున్నత పురస్కారం లభించడం హర్షణీయం.
ఈ సంతోష సమయంలో మా అమ్మను మిస్సవుతున్నాం. దాదా జీవితంలో ఆమె చేసిన కృషి గొప్పది. దాదాకు ఈ పురస్కారాన్ని ప్రకటించిన ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు’’ అని ఆమె పేర్కొన్నారు.