అమరావతి బాలోత్సవం (పిల్లల పండుగ)ను జనవరి 2, 3, 4 తేదీలకు మార్పు చేసినట్టు నిర్వహణ కమిటీ అధ్యక్షుడు చలువాది మల్లిఖార్జునరావు తెలిపారు. సభాకార్యక్రమాల బ్రోచర్‌ను కమిటీ సభ్యులు సోమవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చలువాది మాట్లాడుతూ బాలోత్సవం జనవరి 2వ తేదీన ఉదయం 9.30 గంటలకు పటమట శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆవరణలో ప్రారంభమౌతుందని తెలిపారు. చిన్నారుల్లో సృజన, ప్రతిభా పాటవాలను వెలికితీసి సమాజం పట్ల సానుకూలత, సేవా తత్పరత కలిగించేందుకు ఈ బాలోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.
కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్.కొండలరావు మాట్లాడుతూ ఈ ఉత్సవంలో శాసనమండలి సభ్యులు, మేథావులు, నగర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ కార్యదర్శు లు జి.జోత్స్న, పి.మురళీకృష్ణ, విద్యాఖన్నా, సుబ్బారావు, ప్రొఫెసర్ కైలాసరావు, వల్లభరావు, బి. శ్రీనివాసరావు, సీహెచ్ నరసింహారావు, యు.వి.రామరాజు, కె.శశికుమార్, జి.నారాయణ పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa