రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగుతోందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం హిందూపురంలో ‘వైయస్ఆర్ ఆసరా’ నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. హిందూపురం మున్సిపాలిటీ 1,2,33,34,35,36,37,38వ వార్డులకు వైయస్ఆర్ ఆసరా పథకం ద్వారా 178,302,362 లక్షల రూపాయలు నేరుగా మహిళా సంఘాల ఖాతాలలోకి మన జగనన్న ప్రభుత్వం జమ చేసింది. అలాగే వార్డులలో సిసి రోడ్లు, కాలువలు తదితర అభివృద్ధి పనులకు కూడ లక్ష రూపాయల అభివృద్ధి జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలను తీసుకువచ్చి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తున్న ఘనత సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి పొదుపు సంఘాల్లోని అక్కచెల్లెమ్మల రుణ మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లిస్తానని గత ఎన్నికల సమయంలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పొదుపు సంఘాల్లోని అక్కచెల్ల్లెమ్మలకు డబ్బు జమ చేశారని తెలిపారు. ఈ సారి మహిళలకు పెద్దపీట వేస్తూ 2024 లో జరుగు ఎన్నికల్లో హిందూపురం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైయస్ఆర్‌సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా టీఎన్ దీపిక, ఎంపీ అభ్యర్థిగా "బోయ శాంతమ్మను పోటీ చేయిస్తున్నామన్నారు. ప్రజలు అత్యంత మెజారిటీతో ఓట్లు వేసి ఈ ఇద్దరినీ గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో అబ్జర్వర్ రెడ్డి ఈశ్వర్ రెడ్డి, టిటిడి బోర్డు డైరెక్టర్ పోకల అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి, తగట వీర కార్పొరేషన్ డైరెక్టర్ నాగజ్యోతి, మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ ఫైర్దొస్ ఖలీల్,రాష్ట్ర సహాయ కార్యదర్శి కోటిపి హనుమంత రెడ్డి, నాయకురాలు మధుమతి రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ,మున్సిపల్ వైస్ చైర్మన్లు బలరాం రెడ్డి, జబఉల్ల, టౌన్ బీ బ్లాక్ కన్వీనర్ బెల్లం నరేష్, కౌన్సిలర్లు మల్లికార్జున్ గౌడ్, రామచంద్ర, శివ, మణి నాగరాజు, జయప్ప, రాధమ్మ చంద్ర, కన్వీనర్లు శివశంకర్ రెడ్డి, నౌషాద్,వార్డు ఇన్చార్జిలు నారాయణస్వామి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.