రాజస్థాన్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొవిడ్ వైరస్‌తోపాటు స్వైన్ ఫ్లూ కూడా సోకినట్లు అశోక్ గెహ్లాట్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే గత కొన్ని రోజులుగా జ్వరం వస్తుడంటంతో మెడికల్ టెస్టులు చేయించుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలిపారు. డాక్టర్ల సలహా మేరకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. కొవిడ్, స్వైన్ ఫ్లూ సోకినట్లు తేలిందని ఎక్స్ వేదికగా అశోక్ గెహ్లాట్ వివరించారు.
కొన్ని రోజుల నుంచి తాను జ్వరంతో బాధపడుతున్నట్లు అశోక్ గెహ్లాట్ తెలిపారు. అయితే కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని డాక్టర్లు సూచించారని.. వారి సూచనలతో పరీక్షలు చేయించుకోగా.. కొవిడ్, స్వైన్ ఫ్లూ వచ్చినట్లు నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. తనకు కరోనా సోకినందున ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు అశోక్ గెహ్లాట్ స్పష్టం చేశారు. అందుకే వచ్చే 7 రోజుల పాటు తాను ఎవరినీ కలవలేనని వెల్లడించారు.
ఈ సందర్భంగానే ప్రజలకు అశోక్ గెహ్లాట్ కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో చాలా మంది అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారని.. అందుకే అంతా ఆరోగ్యం విషయంలో తగిన శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రస్తుత వాతావరణంలో జరుగుతున్న మార్పుల కారణంగా వివిధ రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని.. ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని అశోక్ గెహ్లాట్ హితవు పలికారు.