భూమి తిరగడం ఆగిపోతే ఏమౌతుందన్న దానిపై పరిశోధకులు తాజాగా అధ్యయనం చేశారు. భూమి తన అక్షం చుట్టూ సెకన్‌కు 400 మీటర్ల వేగంతో తిరుగుతుందట. భూభ్రమణం మీదనే గురుత్వాకర్షణశక్తి, అయస్కాంతశక్తి తదితరాలు ఆధారపడతాయని తెలిపారు.
ఒకవేళ ఉన్నట్టుండి భూమి తిరగడం ఆగిపోతే గురుత్వాకర్షణశక్తి మాయమైపోయి సముద్రాలు పొంగొచ్చని, భూకంపాలు రావొచ్చని, సునామీలు విరుచుకుపడవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు.