డీఎస్సీ పోస్టుల సంఖ్యను పెంచాలని, మెగా డిఎస్సీ వెంటనే విడుదల చేయాలని ఆదివారం ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాచేపల్లి సూర్య ప్రకాష్ మాట్లాడుతూ డీఎస్సీ ప్రతిపాదనని మంత్రి మండలి ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించింది తప్ప మెగా డీఎస్సీ ప్రకటించలేదని ఆవేదనను వ్యక్తం చేశారు.