దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి బ్యాంక్ రూ.9,163.96 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
గతేడాదితో పోలిస్తే ఇది 35 శాతం తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ రూ.14,205 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మొత్తం ఆదాయం ఇప్పుడు రూ.98,084 కోట్ల నుంచి రూ.1,18,193 కోట్లకు పెరిగిందని ఎస్బీఐ తెలిపింది.