తనను బీజేపీలో చేరాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై ఢిల్లీలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తోందని,
ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ ఇటీవల ఆరోపించారు. ఈ కేసును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆరోపణలపై ఆధారాలివ్వాలని కేజ్రీవాల్‌కు వారు నోటీసులు ఇచ్చారు.