ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ను అర్జునుడితో పోల్చడం హాస్యాస్పదమని జనసేన పార్టీ పవన్ కల్యాణ్ విమర్శించారు. ‘‘సొంత చెల్లి షర్మిల గురించి వైసీపీ శ్రేణులు హీనంగా మాట్లాడినా పట్టించుకోని సీఎం జగన్.. సొంత చెల్లిని గౌరవించని వ్యక్తి.. మన ఇళ్లలోని ఆడపడచులకు గౌరవిస్తాడా?.. వివేకా కుమార్తె తనకు రక్షణ లేదని ఆవేదన చెందుతున్నారు. జగన్ మాత్రం తనను తాను అర్జునుడిలా పోల్చుకుంటున్నారు." అని పవన్ వ్యాఖ్యానించారు.