మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనాని పవన్ బాలశౌరికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎంపీతో పాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా జనసేనలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ముఖ్య నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరడం చాలా గర్వంగా ఉందని బాలశౌరి అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి లేదని విమర్శించారు.